11-03-2025 10:25:46 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ నసురుల్లాబాద్ మండలంలోని దేశయిపేట్ పరిధిలో గల నర్సింగ్ కళాశాలలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వచ్చారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలు విద్యాపరంగా, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్, పరిపాలనాధికారి, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.