calender_icon.png 14 March, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

13-03-2025 09:34:57 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం(Bagh Lingampally Sundarayya Vignana Kendram)లో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(Telangana Marriage Bureau Mediators Welfare Association) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను(International Women's Day Celebrations) గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ హాజరై మహిళలను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి మ్యారేజ్ బ్యూరో సర్టిఫికెట్లు, గుర్తింపు  కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఉగాది పర్వదినాన్ని  పురస్కరించుకొని మూడు నుంచి ఐదు పెండ్లిలు చేసిన వారికి మ్యారేజ్ బ్యూరో ఉత్తమ రత్న అవార్డుతో సత్కరిస్తామన్నారు. అన్ని కులాల వారికి సాంప్రదాయ బద్దంగా సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివతేజ పూస, రాష్ట్ర కోశాధికారి ఐల రవీందర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు భాగ్యమ్మ,అడ్వైజర్ ఈశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు ముదిరాజ్, శ్యామ్ రావు, సెక్రెటరీ రవీందర్ గౌడ్ లతో పాటు మహిళలు  తదితరులు పాల్గొన్నారు.