calender_icon.png 18 March, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్టర్ మైండ్ స్కూల్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

08-03-2025 10:45:12 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లోని మాస్టర్ మైండ్ స్కూల్లో శనివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్ స్కూల్  ప్రిన్సిపల్ రజిత రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా పిల్లలకు పలు సూచనలు చేశారు . తల్లిదండ్రులను గురువులను సమానంగా చూడాలని మహిళలను గౌరవించాలని ఆమె విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ప్రిన్సిపాల్ రజిత రెడ్డి సూచించారు.

అనంతరం విద్యార్థులు  మహిళా దినోత్సవ సందర్భంగా విద్యార్థులు వేషధారణలో అందర్నీ ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. పదో తరగతి విద్యార్థులు ఎగ్జామ్స్ వస్తున్నందున  చక్కగా చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మాస్టర్ మైండ్ ప్రిన్సిపాల్ రజిత రెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.