28-02-2025 06:40:00 PM
లవ్ ఫర్ కవ్ ఛైర్మన్ జస్మత్ పటేల్ వెల్లడి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా శక్తి మహాకుంభ్, మహిళా దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని గుజరాతీ పాఠశాలలో మార్చి 2న నిర్వహిస్తున్నట్లు లవ్ ఫర్ కవ్ ఛైర్మన్ జస్మత్ పటేల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళలకు గో సేవ, సనాతన సేవ, ఆరోగ్య సేవ మొదలైన రంగాలలో పనిచేస్తున్న మహిళలను గోరత్న, మహిళా రత్న, వైద్య రత్న, సమాజ రత్న అవార్డు ప్రదానం చేస్తామన్నారు.
జంట నగరాలలోని అన్ని మహిళా సంస్థలు, సుందర్ కంద్ మండల్, రామాయణ మండల్, జాగ్రన్ మండల్, కిట్టి ప్రాపర్టీ గ్రూప్ సంస్థలను ఆహ్వానించినట్లు తెలిపారు. 2న వేదిక వద్ద నిర్వహంచే ప్రదర్శనలో మహిళలకు ఉచిత స్టాళ్లు అందించబడతాయన్నారు. పాల్గొనే మహిళలకు లక్కీ డ్రా ద్వారా 100 మంది విజేతలకు వెండి నాణేలు ప్రదానం చేస్తామన్నారు. స్టాళ్ల కోసం పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్, చెన్నూరు ఎమ్మెల్యే జి.వేవిక్, సినీ నటుడు సుమన్, మిస్ ఇండియా-24 సుధా జైన్, సమాజ సేవకురాలు కాజల్ ఇందుస్థాని, శిల్ప కధకర్ హాజరు అవుతారని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్.కే.జైన్, రిదేష్ జాగిర్దార్, జైన్ రత్న మీనా ముఖర్జీ పాల్గొన్నారు.