07-03-2025 05:54:45 PM
ప్రముఖ సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి మహిళలందరికీ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి మాట్లాడుతూ... మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కాబట్టి మహిళలు చదువుకున్నప్పుడే దేశాభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ, మహిళా ఉపాధ్యాయులు రాధా, రమా, రమాదేవి, సరస్వతి, శ్రీవాణి, రేఖ, ఉమా విజయలత, ఏపీఓ శ్వేతా, ఏపీఎం లక్ష్మి నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.