14-03-2025 12:00:00 AM
*ప్రత్యేక ఉపాధ్యాయులకు ఘన సన్మానం
హైదరాబాద్, మార్చి 13(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, యునైటెడ్ వాలంటరీ ఆక్షన్ ఫర్ ది రిహబిలిటేషన్ కళాశాల జూబ్లీహాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రత్యేక విద్యార్థుల స్వచ్ఛంద సంస్థలు, మహిళా ప్రతినిధులు, వివిధ ప్రత్యేక పాఠశాలల్లో పనిచేస్తున్న 55 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా లయన్ సురేశ్ జగ్నాని, ఫస్ట్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డిస్ట్రిక్ట్ 320ఏ టీవీఎస్ తులసిలక్ష్మి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లైట్ పఠాన్ ముమైత్‌ఖాన్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారుల కోసం నడుపుతున్న ప్రత్యేక పాఠశాలల్లో 90శాతం కన్నా ఎక్కువ ఉపాధ్యాయులు మహిళలే అన్నారు. ఎంతో సేవచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు గౌరవ వేతనం కింద నెలకు రూ.14,500 నుంచి 17,250 మాత్రమే అందిస్తున్నారని, ప్రభుత్వం వారి వేతనం పెంచాల్సిన అవసరముందన్నారు.
సురేశ్ జగ్నాని మాట్లా డుతూ.. ప్రత్యేక విద్యలో ప్రావీణ్యం సంపాదించి స్వచ్ఛందంగా పాఠశాలలను స్థాపిం చడం గొప్ప విషయమన్నారు. యువార్డ్ స్థాపించి 23 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం ఇదే మొదటిసారని యువార్డ్ జనరల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రెసిడెంట్ జీ వెంకట్రావు, శ్యామల సుందరి, ఎం.కల్యాణి తదితరులు పాల్గొన్నారు.