08-03-2025 10:41:18 PM
ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ నర్సింహ రెడ్డి...
ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని బాలాజీ నగర్ కాలనీలో సుమారు రూ.23 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంక్షేమ భవనాన్ని శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా వృథాగా ఉన్న స్థలంలో కాలనీ కమిటీ సభ్యులందరూ సొంత నిధులతో నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా భవనాన్ని ప్రారంభించడం గర్వకారణమని తెలిపి, మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం నిర్మించిన భవనం పై మరో అంతస్తు నిర్మించాలని మహిళలు కోరగా... నాలుగు, ఐదు నెలల లోపే పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కొండ రెడ్డి, రాఘవా రెడ్డి, రమణ రెడ్డి, సుధ, పావని, మాధవి, మంజుల, నాగ, పద్మ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మునగాల హరీశ్ రెడ్డి, కొండల్ రెడ్డి, నవీన్ రావు, దామోదర గౌడ్, యంజాల జగన్, శ్రీధర్ గౌడ్, కడారి యాదగిరి, నక్క రాజేశ్, సోమనాథ్, ఎల్లారెడ్డి, కిరణ్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటరమణ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సాయి రామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.