- వీరితో 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగాలి
- స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూతనందించండి
- అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి పథకం ద్వా రా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయ క సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలు గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
స్వయం సహాయక సంఘా ల ఫెడరేషన్ల ద్వారా రాష్ర్టంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరితగతన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్లకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి, రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని సూచించారు.
రుణాల రీ పేమెంట్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఇటీవల బ్యాం కర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమకూర్చుడం వంటి పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామని వెల్లడించారు.
వారు కూడా విరివిగా రుణా లు అందించి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం, పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశముంటుందని చెప్పారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమవుతారని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీ సుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ వావిలాల అనీల పాల్గొన్నారు.
ఒక్కో ప్లాంట్‌కు రూ.3 కోట్ల వ్యయం
గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్కీంను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేయబోయే ఒక్కో సోలార్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వ్యయం అవుతుందని సమాచారం. దీనిలో 10 శాతం మహిళా సంఘాలు చెల్లిస్తే, మిలిగిన 90 శాతం నిధులు బ్యాంకు ద్వారా లోన్లు మంజూరు అవుతాయి. సోలార్ ప్లాంట్ల ఇన్ట్సాలేషన్ ప్రక్రియ కూడా వారంలోపే పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. ఒక్కో మెగా వాట్ ఉత్పత్తిపై ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
మంత్రి సీతక్క చొరవతో 17 వ్యాపారాలు గుర్తింపు
మహిళా సాధికారతకు కృషి చేస్తు న్న మహిళా-శిశు సంక్షేమ శాఖ మం త్రి సీతక్క ఎస్‌హెచ్‌జీల ఆర్థికాభివృద్ధి కోసం 17 వ్యాపారాలను గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టుపని, మహిళా శక్తి క్యాంటీన్లతోపాటు పలు రకాల వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. దీంతోపాటు త్వరలోనే మహిళా సంఘాలకు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను నిర్వహించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నది.