జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 1: కుంభ మేళా పవిత్ర స్నానానికి జగిత్యాల నుండి వెళ్లి అక్కడ తప్పిపోయిన మహిళలు ఎట్టకేల కు శనివారం క్షేమంగా ఇంటికి చేరుకు న్నారు. బాధితులు, కుటుంబ సభ్యులు తెలి పిన వివరాల ప్రకారం జగిత్యాల విద్యాన గర్కు చెందిన వీర్ల నరసవ్వ, కొత్తవాడకు చెందిన ఆది రాజవ్వతో పాటూ నిర్మల్ జిల్లా కడెంకు చెందిన వారి సమీప బంధువులు బుచ్చవ్వ, సత్తవ్వలు మరో 8 మంది కలిసి ఈనెల 27న కుంభమేళాకు వెళ్లారు.
29న ప్రయాగ్రాజ్ చేరుకున్న వారంతా కుంభమే ళాలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే 8 మంది మహిళలు తిరిగి రాగా జగిత్యాలకు చెందిన నరసవ్వ, రాజవ్వ , కడెంకు చెందిన బుచ్చవ్వ, సత్యవ్వలు తప్పిపోయిన విషయం తెలిసిందే. పరాయి రాష్ర్టంలో భాష రాక, సెల్ ఫోన్, డబ్బులు లేకపోవడంతో ఇంటికి రావడానికి ఇబ్బందులు పడినట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నెల్లూ రుకు చెందిన తెలుగువారు పరిచయమ వడంతో వారి సహాయంతో వరంగల్ వరకు చేరుకొని అక్కడి నుండి ఇంటికి వచ్చారు. ఎట్టకేలకు కుంభమేళాలో తప్పిపోయిన మహిళలు ఇంటికి చేరడంతో వారి బంధువు లు సంతోషం వ్యక్తం చేశారు.