calender_icon.png 4 October, 2024 | 6:44 PM

బతుకమ్మ ఆడడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్న మహిళలు

04-10-2024 04:35:04 PM

గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదు

కొండపాక (విజయక్రాంతి ): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో ఆడపడుచులకు సంబరమైన పండుగ బతుకమ్మ పండుగ, ఆడపిల్లల ఆత్మగౌరానికి ప్రత్యేకత బతుకమ్మ పండుగ అని అమ్ముల బాల నరసయ్య అన్నారు. గురువారం రోజు సిపిఎం గ్రామ శాఖ సమావేశం వెలికట్టలో బాల నరసయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఆడపడుచులు ఆడుకోవడానికి స్థలం లేక బజారులో పెట్టి ఆడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వాహనదారులు రాకపోవడానికి అనేక ఇబ్బందులు, చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్న సందర్భాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి గ్రామంలో కావాల్సిన ఆటస్థలం ఉన్నదని గ్రామపంచాయతీ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకునే పాపాన లేరు గ్రామ కార్యదర్శి నరసింహులు గ్రామపంచాయతీ గ్రామ కట్నం ప్రభుత్వ స్థలం ఉందని చరవాణి ద్వారా సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి స్థలంలోని పిచ్చి చెట్లను గడ్డి చేతన తొలగించి శుభ్రం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు