calender_icon.png 24 February, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్‌యార్డు ముట్టడికి యత్నించిన మహిళలు

15-02-2025 11:42:09 PM

పటాన్‌చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డును ముట్టడించేందుకు గుమ్మడిదల మండల మహిళలు రైతు జేసీ ఆధ్వర్యంలో శనివారం యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జాతీయ రహదారిపై భారీగా జనం గుమ్మిగూడారు. ఈ సందర్భంగా డంపింగ్‌యార్డు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరో వైపు డింపింగ్‌యార్డును వ్యతిరేకిస్తూ నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలలో చేపట్టిన నిరసనలు పదకొండో రోజుకు చేరాయి. నల్లవల్లి రిలే నిరాహార దీక్షలో అర్ధనగ్నంగా నిరసనలు తెలిపారు. గుమ్మడిదలలో శుక్రవారం ట్రాక్టర్‌లతో నిరసన తెలిపిన ప్రజలు శనివారం ఆటోలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బొంతపల్లిలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. గుమ్మడిదల రిలే దీక్షలో ముస్లీంలు భైటాయించి నిరసన తెలిపారు. డింపింగ్‌యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.