25-04-2025 01:12:26 AM
ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : గత పాలనలో దేశంలో ఎమర్జెన్సీ చీకటి పాలన విధించి ప్రజల నిర్బంధానికి కారణమైన ఇందిరా గాంధీ చరిత్ర కాకుండా అహల్య భాయ్ ఝాన్సీ లక్ష్మి రాణి రుద్రమ జిజియాబాయ్ లాంటి వీరవంచల చరిత్రను మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టి పి యు ఎస్ హిందూ జిల్లా శాఖ నిర్వహించిన అహల్యబాయ్ హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మల్కా కుమురయ్యతో హాజరయ్యారు. కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రదాలు చేసిన మరణకాండ తనను ఎంతగానో కలిసివేసిందన్నారు.
ఉగ్రములకు పాకిస్తాన్ సహకరించడాన్ని సూర్యనారాయణ తీవ్రంగా ఖండిస్తూ వారికి తగిన బుద్ధి చెప్పే చర్యలు ప్రారంభమయ్యాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి సురేష్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి డీఈవో అశోక్ ముఖ్యవస్థలు కల్పన ఏబీవీపీ వివాగ్ ప్రముఖ రేంజర్ల నరేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.