07-02-2025 10:56:55 PM
ఏఎస్సిడిఓ సునిత..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మహిళలు రమాబాయిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఏఎస్సిడిఓ సునీత విద్యార్థులకు పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాలేజీ హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి తన నలుగురు బిడ్డలు అనారోగ్యంతో చనిపోతున్న కోట్లాదిమంది బిడ్డలకు విద్యనందించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కి అండగా నిలిచి అనేకమంది బిడ్డలకు అనేక హక్కులు కల్పించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి సేవ త్యాగం ఎనలేనిదన్నారు.
శుక్రవారం రమాబాయి పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షెడ్యూల్ క్యాష్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల సమక్షంలో రమాబాయి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి సునీత మాట్లాడుతూ... అనేక కష్టనష్టాలను ఓర్చుకొని భవిష్యత్తు తరాల కోసం తన బిడ్డల ప్రాణాలు పోయినప్పటికీ మనోవేదనకు గురికాకుండా ధైర్యంగా కోట్లాదిమంది ప్రజలకు హక్కులు కల్పించడంలో రమాబాయి పాత్ర మరువలేని దానికి కొనియాడారు.