calender_icon.png 10 March, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వంపై మహిళలు ఉద్యమించాలి

09-03-2025 05:09:37 PM

పిఓడబ్ల్యు రాష్ట్ర నేత అందే మంగ పిలుపు..

భద్రాచలం (విజయక్రాంతి): మహిళలంతా సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వంపై ఉద్యమించాలని మహిళలపై జరుగుతున్న హింసలను తిప్పి కొట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సుకు పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు కప్పల సూర్యకాంతం అధ్యక్షతన జరిగింది. అనంతరం రాష్ట్ర కార్యదర్శి అందే మంగ మాట్లాడుతూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక వేడుక కాదని అది ఒక సెలవు దినం కాదని దాని వెనక ఒక కన్నీటి చరిత్ర ఉందని, ఈనాటి మహిళా లోకం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. 

నాడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మొత్తం దెబ్బతిని పరిశ్రమలకు పనికి వెళ్లిన వారిని శ్రమదోపిడి చేసి విశ్రాంతి తీసుకుంటే కూడా వేతనం కట్ చేసి ఇచ్చేవారని ఈ శ్రమ దోబడి నుండి పుట్టిన పోరాట ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని వారన్నారు. మహిళలు ప్రపంచవ్యాప్తంగా శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఆడవారి ఓటు హక్కు కోసం, పని సమయం కోసం, మహిళా చట్టాల కోసం అనేక ఉద్యమాలు చేశారని వారు గుర్తు చేశారు. ఈనాడు మహిళలు కార్మికులు శ్రామికులు అనుభవిస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు మహిళా పోరాటాల ద్వారా సాధించుకున్నాయని వారన్నారు. నేడు అనేక చట్టాలు వచ్చినప్పటికీ ఇంకా శ్రమ దోపిడీ జరుగుతుందని పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని వారన్నారు శ్రమించే కార్మికులకు వారి శ్రమను గుర్తించకుండా ప్రభుత్వ ఫ్రీ పథకాలతో వారి శ్రమను పక్కదోవ పట్టిస్తున్నారని వారు అన్నారు.

మరోపక్క మణిపూర్ ఛత్తీస్గడ్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో మహిళలను అర్ధనగ్నంగా ఊరేగిస్తూ హింసిస్తూ నడిరోడ్డుపై హత్య చేస్తున్నారని వారన్నారు. ఆదివాసి గ్రామాలలో ఆపరేషన్ కగార్ పేరుతో మహిళలని ఊచ కోత కోస్తున్నారని వారన్నారు. ఈ నిర్బంధాలపై వారి హక్కులపై ప్రశ్నించే మహిళ నేతలను విద్యావంతులను ఊపా, టాడా, రాజ ద్రోహం, అర్బన్ నక్సలైట్ ల పేరుతో కేసులు నమోదు చేస్తూ జైల్లో నిర్బంధిస్తున్నారని వారన్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర మనకి ఒక స్ఫూర్తి కావాలని ఆస్పూర్తితో మన హక్కులను మనం కాపాడుకోవాలని వారన్నారు. పోరాడంది ఏది రాదని పోరాటమే ప్రతిదానికి ఒక మెట్టుగా ఉండాలని వారు అన్నారు. ఈనాడు సింగరేణి మరియు ఇతర పారిశ్రామిక రంగాలు అనేక లాభాల్లో ఉండటానికి కారణం మహిళల శ్రమ ఉందన్న విషయాన్ని ఈ యజమాన్యాలు గుర్తించాలని, ప్రభుత్వాలు తెలుసుకోవాలని వారన్నారు.

చట్టసభలలో కూడా మహిళలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలని ఆమె 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళను ఒక అంగడి సరుకుగా వ్యాపార సరుకుగా చూస్తున్నారని ఇది తక్షణమే నిలిపివేయాలని ఆమె హెచ్చరించారు. అందుకే నిజమైన మహిళా దినోత్సవం అంటే కష్టానికి తగ్గ ఫలితం వచ్చిన రోజు మాత్రమే అని వచ్చిన లాభాలలో శ్రామికులకు వాటా ఇచ్చిన రోజేనని వారన్నారు ఈనాడు భూమి నుండి దివి వరకు జరిగే ప్రతి పనిలో మహిళల శ్రమ కూడా ఉందని గుర్తించాలని వారు అన్నారు. జరుగుతున్న నిర్బంధాలపై జరుగుతున్న శ్రమ దోపిడిపై మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని మన హక్కుల కోసం నిలబడాలని వారు గుర్తు చేశారు. 

ఈ మహిళా దినోత్సవం సభలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, పిఓడబ్ల్యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి సున్నం భూలక్ష్మి, అరుణోదయ జిల్లా సహాయ కార్యదర్శి జక్కం కొండలరావు, ఎమ్మార్పీఎస్ మండల నాయకురాలు లతా, పిఓడబ్ల్యు జిల్లా డివిజన్ మండల నాయకులు ఇర్ప సమ్మక్క, కారం శ్రీదేవి, కోట నాగమణి, రజిని, ఆదిలక్ష్మి, రాజమ్మ, కమల తదితరులు పాల్గొన్నారు.