calender_icon.png 27 December, 2024 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

10-07-2024 05:33:45 AM

  • దివ్యాంగుల కోసం ప్రత్యేక పోర్టల్ 
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 
  • ములుగులో మహిళాశక్తి క్యాంటీన్ ప్రారంభం

ములుగు (జయశంకర్ భూపాలపల్లి), జూలై 9 (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించిన ఆమె.. ములుగు నుంచి పత్తిపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్ ఆవరణలో మహళాశక్తి క్యాంటీన్‌ను ఎంపీ పోరిక బలరాంనాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మా ట్లాడుతూ.. మహిళల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, స్వయం ఉపాధి మార్గాలతో ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి అండగా నిలువాలని అన్నారు. దివ్యాంగుల సంక్షే మం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. 

వారికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించి ఎవరికి ఉద్యోగ అర్హత ఉంటుందో సరిచూసి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇంగ్లిష్ మీడియం బోధన చేపడుతామని తెలిపారు. అంగన్ వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఏర్పడిందని, ఆగస్టులో రైతు రుణమాఫీ పూర్తయ్యాక గొప్పగా అభివృద్ధి వైపు అడుగులు పడుతాయనని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని, గుత్తేదార్లు తమ ఇష్టానుసారం వ్యవహ రిస్తే సహించేది లేదని, నాణ్యతతో కూడి పౌష్టికాహరం అందించాలని, లేనిపక్షంలో లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ తోపాటు ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు రూ.50 వేల చొప్పున చెక్కులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, అదనపు కలెక్టర్లు పీ శ్రీజ, సీహెచ్ మహేందర్‌తోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.  

‘తులసి’ కోరిక తీర్చిన సీతక్క

ములుగు (జయశంకర్ భూపాలప ల్లి), జూలై 9 (విజయక్రాంతి): తనలాంటోళ్లు చదువుకోవడానికి తమ గూ డెంలో పాఠశాల భవనం లేదంటూ ఓ చిన్నారి చెప్పిన మాటలు మంత్రి సీతక్కను కదలించాయి. చిన్నారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ౧౫ రోజుల్లోనే పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేసి లాంఛ నంగా ప్రారంభించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం తక్కళ్లపాడు గోత్తికోయగూడెంలో మంగళవారం నూత నంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని సీతక్క ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్కను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. గూడెంలో పాఠశాల భవనాలు కట్టించి అందరికి విద్య అందేలా చూస్తానని ఆమె హమీ ఇచ్చారు.