11-04-2025 12:19:25 AM
గోపాలపేట ఏప్రిల్ 10 విజయ క్రాంతి: మహిళలు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ ఈశ్వరయ్య అన్నారు. వనపర్తి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపు ద్వారా గత వారం రోజులుగా గోపాల్పేట మండలంలో మూడు గ్రామాలను ఉంచుకొని క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలను చేపట్టి గ్రామ ప్రజల అభినందనలు గెలుచుకున్నారని అన్నారు.
విద్యార్థినిలు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లుగా ప్రతి కాలనీకి వెళ్లి రోడ్లు ముళ్ళ చెట్లు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం గురువారం ముగిసిందని ఈశ్వరయ్య అన్నారు. ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులు పెద్దలు సహకరించడం వల్ల ఈ యెన్ ఎస్ ఎస్ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీనివాసులు రూపా లక్ష్మీ వైస్ ప్రిన్సిపాల్ రామరాజు యాదవ్ దేవేందర్ రెడ్డి పుష్ప సుష్మా దావులమ్మ పాషా రాముడు తోపాటు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.