11-03-2025 04:44:24 PM
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన, మహిళా శక్తి క్యాంటీన్ ను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రారంభించారు. దోమకొండ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన అన్నారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించి ఉపాధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల అధికారులు, మండల సమైక్య సభ్యులు, మండల బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.