calender_icon.png 4 March, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

03-03-2025 12:35:10 AM

పీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని టీపీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా పేర్కొన్నారు. మహిళలు పురుషుల తో సమానంగా రాణిస్తూ ముందుకుసాగుతున్నారని కొనియాడారు.

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో నాగోల్‌లోని పీబీఆర్ కన్వెన్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. కార్యక్రమంలో దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొన్నారు. వీరికి లక్కీ డిప్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి సుర పల్లి నందా మాట్లాడుతూ.. కార్యక్రమానికి ఇంతపెద్దమొత్తంలో మహిళలు రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. మహిళలు రాజకీయంగా ఎదిగితేనే దేశం బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరో ముఖ్య అతిథిగా హాజరైన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా గీతగుప్తా ఎన్నికవడం అభినందనీయమని, తెలంగాణలోనూ వైశ్య మహిళలు ఆ స్థాయి కి ఎదగాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మొగుళ్లపల్లి ఉపేందర్, గౌరిశెట్టి ప్రభాకర్, పోలా విజయ్‌కుమార్, కర్నాటి విజయ్‌కుమార్ గుప్తా, ఎమ్‌ఎల్‌ఆర్ గుప్తా, ఎల్‌వీ కుమార్, మల్లికార్జున్ గుప్తా, రామకృష్ణ టంగుటూరి, రమేశ్ గుప్తా, వాసు, జగిని శ్రీనివాస్, జగిని రమేశ్, కూర నాగరాజు వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ సలహా కమిటీ చైర్మన్ రాజమౌళి పాల్గొన్నారు.