calender_icon.png 5 February, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

05-02-2025 12:52:34 AM

  1. నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి         
  2. మినీ సరస్ ఫెయిర్ ప్రారంభం 

నల్లగొండ, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ త్రిపాఠి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో స్వయం సహాయ సంఘాల చేనేత, హస్తకళ, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ’మిని సరస్ ఫెయిర్- 2025ను ప్రారంభించి ఆమె మాట్లాడారు.

రాష్ట్రంలో తొలిసారి మహిళా సంఘాల కోసం నల్లగొండలో సరస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను ఆన్లైన్లోనూ మార్కెట్ చేయాలని సూచించారు. ఈ నెల 8 వరకు సరస్ ప్రదర్శన కొనసాగనుంది.

కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సహాయ సంచాలకుడు జీ కోటేశ్వర రావు, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి, గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్, సెర్ప్ డైరెక్టర్ పీడీ జాన్సన్, ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ, పరిశ్రమల శాఖ జీఎం వీ. కోటేశ్వర్రావు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.