మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తు న్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా.. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభు త్వం లక్ష్యం అని ఆమె అన్నారు.
ప్రజా పాలనా విజయోత్సవాలలో భాగంగా జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం సంగీత్ జంక్షన్, వైఎంసీఏ వద్ద రూ.38.51 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లను మేయర్ ప్రారంభించారు.