11-02-2025 06:10:31 PM
దస్తూరాబాద్: పురుషులతో పాటు మహిళలను సమానంగా చూడాలని మహిళ సాధికారత కేంద్రం జనరల్ స్పెషలిస్టులు జ్యోతి, మౌనిక, శైలజ, పద్మావతిలు అన్నారు. బేటీ బచావో బేటీ పడావో పథకం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 45 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో, కెజిబివి పాఠశాలలో విద్యార్థులకు, భేటీ బచావో బేటి పడావో పథకం గురించి, లింగ సమానత్వం, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత, బాలికల సాధికారత, చైల్డ్ లైన్ సర్వీసెస్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు, బాల్య వివాహ నిర్మూలన చట్టం 2006, సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ నెంబర్లు 100, 1098, 181, 1930, ఆరోగ్య పరిశుభ్రత, పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వో తిరుమల, హెచ్ ఎం చందు లాల్, అంగన్వాడి సూపర్వైజర్ రాధా, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.