02-04-2025 12:00:00 AM
పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి
ఖమ్మం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి):- ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం గోకినపల్లి లలిత అధ్యక్షతన మంగళవారం జరిగింది.ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, నానాటికి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు.
‘ మిస్ వరల్ ‘ ప్రపంచ సుందరి పోటీలు 2025 మే నెలలో హైదరాబా దులో జరగనున్నట్లు తెలంగాణ టూరిజం హెరిటేజ్, సాంస్కృతిక శాఖ ప్రకటించిందని, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రదర్శనకు కోట్లాది రూపాయలను కేటాయిస్తూ ఇది రాష్ట్రానికి చాలా లాభదాయకమని దండోరా వేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో పోరాట చరిత్ర గలదని, నైజాం రాజులకు,దొరలకు, భూస్వాములకు, పెత్తందారులకు ఎదురొడ్డి నిలిచిన పోరాట గడ్డ అన్నారు.
రజాకార్లపై తిరగబడ్డ ఆత్మస్థైర్యం ఇక్కడి మహిళల సొంతం అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పరిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల మంగతాయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపి ణీ చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు తుడుము ఝాన్సీ, జిల్లా సహాయ కార్యదర్శి శోభ, పరిమళ, లలిత, సరోజిని, చైతన్య పాల్గొన్నారు .