08-03-2025 11:02:46 PM
ప్రిన్సిపల్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమానత్వమే మహిళా దినోత్సవ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. పిల్లలకు చిన్ననాటి నుంచే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, కట్టుబాట్లను తెలియజేస్తూ పెంచాలని అప్పుడే వారు ఉన్నత స్థానంలో నిలుస్తారని స్పష్టం చేశారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు న్యాయమూర్తిని శాలువ కప్పి సన్మానించి కేక్ కట్ చేయించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఆటలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు వాణి, ఉమ, అరవింద, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాత శ్రీనివాస్,, ముక్క కృష్ణమూర్తి, కోశాధికారి కిషోర్, క్లబ్ అంతర్జాతీయ సభ్యులు గంధం శ్రీనివాస్ ఎక్కిరాల శ్రీనివాస్ చిలువెరీ వెంకటేశ్వర్, గుండా ప్రమోద్, గుండా వెంకన్న, రావుల శంకర్, న్యాయవాది ముక్త సురేష్, వాసవి, వనిత సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.