calender_icon.png 16 March, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి

08-03-2025 11:06:05 PM

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలత

ముషీరాబాద్,(విజయక్రాంతి): మహిళలు చట్టాల పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలని, మానసిక దృఢత్వంతోనే ముందడుగు వేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు  బాలలత పేర్కొన్నారు. ఈ మేరకు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గల దొడ్డి కొమరయ్య హాల్లో అఖిల గాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా సంఘం సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించాలంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రాణించాలన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చూస్తేనే ఏ విషయంలోనైనా రాణించగలుగుతారని అన్నారు. సమాన హక్కుల తో పాటు రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలు చేపడుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు హత్యలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళలను శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తెలికుల సంఘం అధ్యక్షుడు రామచందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, డాక్టర్ అమరగంటి శ్రీనివాస్, అనుగుల రాజేందర్, ప్రసాద్, సాహితీ, కృష్ణవేణి  తదితరులు పాల్గొన్నారు.