ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 12 నెలల కాలానికి గానూ ప్రభు త్వం ప్రతి మహిళకు రూ.30 వేలు బాకీ పడిందన్నారు. కాగా రేవంత్ రెడ్డి సీఎం అయి ఏడాది కావొవస్తున్నా.. నాగార్జునసాగర్ డ్యామ్ సీఆర్పీఎఫ్ ఆధీనంలోనే ఉన్నదన్నారు. తెలంగాణ అధీనంలోకి రాకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ నీళ్ల గురించి ఆయన గురువు చంద్రబాబను ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.