calender_icon.png 10 October, 2024 | 6:53 PM

బతుకమ్మ పండుగలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి

10-10-2024 04:30:01 PM

హుజూర్ నగర్ (విజయక్రాంతి): హుజూర్ నగర్ ప్రజలకు ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా  ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బతుకమ్మ  పండుగలో భాగంగా ఆభరణాలు ధరించే మహిళలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు మీకు దగ్గరగా వచ్చి మిమ్ములను ఏమారిచ్చి మీ ఒంటిపై ఉన్న బంగారపు నగలను దొంగలించే అవకాశం ఉన్నది. కావున జాగ్రతగా ఉండండి. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు, గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా కనబడితే ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే హుజూర్ నగర్ సిఐ గారు 8712686012/ 100 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ప్రశాంతమైన వాతావరణంలో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, శాంతి భద్రతల రక్షణ విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను.