మంచిర్యాల, విజయ క్రాంతి: చట్టాలబ్బాయి మహిళలకు అవగాహన కలిగి ఉండాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉపనిష ధ్వని అన్నారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షులు బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు కోర్టు ఆవరణలో మహిళ చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ద్వితియ ప్రథమ శ్రేణి జడ్జి నిరోషతో కలిసి మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, లైంగిక వేధింపులు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక చర్యలపై అవగాహన కల్పించారు.
వివిధ మహిళ చట్టాలపై దిశా నిర్దేశం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న మహిళ ఉద్యోగినులకు జరుగుతున్న లింగ వివక్ష, వాటి నివారణ చర్యలు, చట్ట పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు, నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు వివరించారు. ఏదైన సమస్యలు తలెత్తితే న్యాయసేవా సంస్థను సంప్రదించి తగు న్యాయ సలహాలు పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు, సంఘ సేవకురాలు శాంకరీ, సువర్ణ, మహిళ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.