calender_icon.png 12 March, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

12-03-2025 01:27:19 AM

అదనపు కలెక్టర్ గంగాధర్ 

యాదాద్రి భువనగిరి, మార్చి 11 (విజయక్రాంతి) : మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సమాఖ్య కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవము జిల్లా స్తాయి వేడుకలు నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  మాట్లాడుతూ ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు, మహిళా సంఘాల ద్వారా సాధించిన ప్రగతి,  బ్యాంక్ స్త్రీనిధి ద్వారా తీసుకున్న లోను తిరిగి చెల్లించుట , మొదలగు అంశాలలో యాదాద్రి జిల్లా ముందంజలో ఉందన్నారు. 

కార్యక్రమములో జిల్లా గ్రామీనాభివ్రుద్ది అధికారి  నాగిరెడ్డి  , జిల్లా ముఖ్య కార్య నిర్వహణ అధికారి  శోభారాణి , జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు  రేణుక, అదనపు జిల్లా గ్రామీనాభివ్రుద్ది అధికారి శ్రీనివాస్ , జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ లు , స్త్రీనిది సిబ్బంది, జిల్లాలోని మండల సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు కోశాధికారులు పాల్గొన్నారు.