calender_icon.png 11 March, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

11-03-2025 12:00:00 AM

నారాయణపేట, మార్చి 10 (విజయక్రాంతి): మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట మున్సిపా లిటీలో పని చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను, గిరిజన మహిళలను, మహిళలను నారాయణపేటలో శాలువలతో ఘనంగా సత్కరించి చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు.  తమ ఫౌండేషన్ ఆధ్వర్యం లో గతంలో పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

మహిళల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని హామీనిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా పారిశుద్ధ్య కార్మికులను, మహిళలను సన్మానించడం అభి నందనీయమని మహిళా పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ సేవారంగంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, మధుసూదన్ రెడ్డి, హన్మంత్, మన్నె గోపాల్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రుద్రారెడ్డి, నర్సింహులు, శివరాజ్, గోపాల్ గౌడ్, ఎం.సంతోష్, వెంకటరావు, వై.సంతోష్, నర్సింహులు, కృష్ణ, నగరి నాగురావు, మేంగ్జీ నందుకుమార్, బసుదే అశోక్ కుమార్, అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికు లు, మహిళలు పాల్గొన్నారు.