10-03-2025 08:23:14 PM
హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్ బాబు..
ఎల్బీనగర్: హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కళాశాల మహిళా సాధికారికత విభాగం, జాతీయ సేవా పథకం యూనిట్ల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్ బాబు మాట్లాడుతూ.. మహిళలు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, ఆర్థికంతో పాటు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాలన్నారు. మహిళా సాధికారికత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ అపర్ణ చతుర్వేది మాట్లాడుతూ... బలమే జీవనం-బలహీనమే మరణం అన్న సూక్తితో మహిళలు ముందుకెళ్లాలన్నారు.
స్త్రీ ఆరోగ్యంలో యోగా పాత్రపై ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత వివరించారు. అనంతరం విద్యార్ధినులకు పాటల, నృత్య, మెహందీ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా అధ్యాపకులు, మహిళా సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఎన్ఎన్ఎస్ ఆఫీసర్ డాక్టర్ శారదా దేవి, వైస్ ప్రిన్సిపల్ వి.ఇందిర, డాక్టర్ గీతా నాయక్, డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ రమాదేవి, వై.రమాదేవి, లావణ్య, విద్యార్థినులు పాల్గొన్నారు.