08-03-2025 11:30:19 PM
మహిళా దినోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్...
కల్లూరు (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తేనే సమాజం అన్ని విధాలా స్వయం సమృద్ధిని సాధిస్తుందని సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా కల్లూరులో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు స్వయం సాధికారత దిశగా పురోగమించాలని కోరుకుంటూ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, కల్లూరు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్‌రావు ఎమ్మెల్యేకు మెమోంటో అందజేసి, శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐసిడియస్ సిడిపివో నిర్మల జ్యోతి, ఎంపిడివో చంద్రశేఖర్, భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మాధవి హాస్పిటల్ డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.