భద్రాచలం (విజయక్రాంతి): మహిళలందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా ఉండి స్వశక్తితో కుటీర పరిశ్రమలు నెలకొల్పుకొని ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకొని పదిమందికి ఉపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం నాడు దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరంలోని గిరిజన చిక్కి యూనిట్ ను పరిశీలించి, పల్లి పట్టి తయారు చేసే విధానాన్ని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటి పట్టునే ఖాళీగా ఉండే గిరిజన మహిళలు ఏడుగురు 24 లక్షల సబ్సిడీతో 40 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న గిరిజన చిక్కి యూనిట్ను మహిళలందరూ సమన్వయంతో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుగాని జీవనోపాధి పెంపొందించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు.
మహిళలు చిక్కి యూనిట్ ను నడుపుకొని జీవనోపాధి పెంపొందించుకోవడానికి 40 లక్షల యూనిట్ కాస్ట్ తో గిరిజన చిక్కి యూనిట్ నెలకొల్పుకొని, తయారుచేసిన తినుబండారాలను మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకొని అమ్మకాలు జరుపుకొని లబ్ధి పొందాలని అన్నారు. ముడి సరుకులు సొంతంగా తామే కొనుగోలు చేసుకుని నాణ్యత గల పల్లి పట్టిని తయారుచేసి డిజైన్ గా ప్యాకింగ్ చేసి సరసమైన ధరలకు అమ్ముకోవాలని అన్నారు. గిరిజన చిక్కి యూనిట్ నెలకొల్పుటకు 40 లక్షలు యూనిట్ కాస్ట్ కాగా 24 లక్షలు సబ్సిడీ, 12 లక్షలు బ్యాంకు రుణము నాలుగు లక్షలు బెనిఫిషర్ కంట్రిబ్యూషన్ తో యూనిట్ను ఏర్పాటు చేసుకున్నామని మహిళలు పిఓకి తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ ఓ ఉదయభాస్కర్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏటిడిఓ అశోక్ కుమార్, జేడీఎం హరికృష్ణ, యూనిట్ మహిళలు అర్చన, గంగ, నర్సిరత్నం, రాజమ్మ, నాగేశ్వరరావు, కార్తీక్, రవి తదితరులు పాల్గొన్నారు.