calender_icon.png 17 April, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగంలోని మహిళా హక్కులకు తూట్లు.!

16-04-2025 12:00:00 AM

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి.

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ): దేశంలోని మహిళల భద్రత కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళ హక్కులను కాపాడుతూ అనేక చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారని వాటికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు.

మంగళ వారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వెంట పూలే అంబేడ్కర్ యాదిలో మహిళ హక్కుల పరిరక్షణ యాత్రను చేపట్టారు. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు వంటివి జ రుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమా త్రం స్పందించడం లేదని ఆరోపించారు.

మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన వాటిని పటిష్టంగా అమలు చేయడంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. యాత్రలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, జ్యోతి, ఆశలత, షబానా, సాయిలీల, కవిత, భారతి,  ఐద్వా జిల్లా కార్యదర్శి గీత, నిర్మల, శ్రీలక్ష్మి, చిన్నమ్మ, ఈశ్వర మ్మ, సిఐటియు నాయకులు శ్రీనివాస్, పర్వతాలు, రామయ్య, కాశన్న, మధు, మల్లికార్జు న్, శివరాం తదితరులు పాల్గొన్నారు.