calender_icon.png 26 March, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇండ్లు ఇవ్వాలి

24-03-2025 03:17:50 PM

హయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా 

ఎల్బీనగర్: అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం కేటాయించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. హయత్ నగర్ లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ నాయకులు రవీంద్ర చారి, సామిడి శేఖర్ రెడ్డి  ఆధ్వర్యం లో మహిళలు ధర్నా నిర్వహించారు.  అనంతరం ఎమ్మార్వో ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ .. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో తీసుకున్న అప్లికేషన్ల ఆధారంగా అర్హులను వెంటనే ప్రకటించాలని, భూమి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న పేద ప్రజలకు ఇస్తానన్న రూ. 5 లక్షలు వెంటనే ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగాయని, ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని రూ. 8 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.