calender_icon.png 2 November, 2024 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్ల కోసం మహిళల నిరసన

13-09-2024 01:15:55 PM

నీటి సమస్య తీర్చాలని డిమాండ్

దుబ్బాక (విజయక్రాంతి): తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామ సమస్య లపై పంచాయతీ కార్యదర్శి కి చెప్పిన సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారుల పాలన లో గ్రామం అస్త వ్యస్తంగా మారిందన్నారు.

స్థానిక ఎస్సి కాలనీ లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని నీటి సమస్య తో పాటు విధిలైట్ లు కూడా రావడం లేదని మండిపడ్డారు.  మరమ్మతులకు గురైన మోటార్లను బాగు చేయకుండా రోజుల తరబడి జాప్యం చేస్తుం డడం, మరోవైపు ట్యాంకర్లతో అరకొరగా సరఫరా చేస్తుండడంతో ఎటూ సరిపోవడం లేదని ఆరోపిస్తున్నారు. బోరుబావుల మోటార్లు బాగు చేయాలని, ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి సమస్యను తీర్చాలన్నారు.. సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్న సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు