07-03-2025 01:12:05 AM
నిర్మల్ మార్చ్ 6 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల విన్నర్ లో మీకోసం పోలీస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువేందుకు కొత్త ఓరువడికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా పట్టణాలతో పాటు ఆయా మండలాల్లో ప్రతిరోజు శాంతి భద్రతల పర్యవేక్షణ గాను విధులు నిర్వహిస్తున్న పెట్రో కార్ సేవల్లో మహిళా పోలీసులకు భాగస్వామ్యం కల్పిం చారు.
ఇదివరకు మగ పోలీసులు మాత్రమే ఈ విధులు నిర్వహిస్తుండగా ప్రతి వాహ నంలో ఇద్దరు మగ పోలీసులతోపాటు ఒక మహిళ కానిస్టేబుల్ విధులు నిర్వహించే విధంగా గురువారం చర్యలు చేపట్టారు.
క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టు కొని మహిళా సిబ్బందికి మహిళలకు చేదో డుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకో వడం జరిగిందని ఎస్పీ జానకి షర్మిల వెల్ల డించారు పెట్రో కార్ విధుల్లో మహిళలను నియమించడంపై జిల్లాలో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.