calender_icon.png 23 November, 2024 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక వ్యవస్థలో మహిళలది కీలక పాత్ర

23-11-2024 12:57:27 AM

అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక పాత్ర పోషించాలని, తమ దేశ  ప్రభుత్వ విధానంలో ఇది భాగమని హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీకి చెంది న మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు అమెరికా కాన్సుల్ ఆధ్వర్యంలో ఏడబ్ల్యూఈ ప్రోగ్రామ్ శిక్షణ ఇప్పించింది.

తెలంగాణలో అరవై మంది శిక్షణను విజయవంతం గా పూర్తి చేసుకోగా.. వారికి శుక్రవారం గ్రాడ్యుయేషన్ డేను నిర్వ హించారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేయడానికి అమెరికా కృషి చేస్తుందన్నారు. ఏపీలో శిక్షణ పొందిన వారికి ఈ నెల 26వ తేదీ గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించనున్నారు.