calender_icon.png 17 March, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి..

17-03-2025 04:27:10 PM

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధరావత్ చంద్రకళ..

మందమర్రి (విజయక్రాంతి): మహిళలు తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుని అన్ని రంగాలలో ఎదగాలని ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగాలని జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దరావత్ చంద్రకళ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్ లో విశిష్ట మహిళ అంబేద్కర్ పురస్కారం 2025 కార్యక్రమానికి ఆమే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతుందని మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మహిళా సాధికారిక సాధ్యం అవుతుందని ఆమె స్పష్టం చేశారు.

సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ గాజర్ల దేవేందర్ మాట్లాడుతూ... మహిళలు నేడు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించాలని అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే మరింత మంది మహిళలకు అవకాశాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ.. మహిళలు ఆటెండర్ నుండి అంతరిక్షం వరకు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారన్నారు. మగువలకి ప్రోత్సాహం లభిస్తే ఏ స్థాయిలోనైనా రాణిస్తారని అవకాశాలను అంది పుచ్చుకొని ముందుకు సాగాలని కోరారు.

అనంతరం ఆయా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 25 మంది మహిళలకి విశిష్ట మహిళా రమాబాయి అంబేద్కర్ పురస్కారం 2025 అవార్డులను అతిథిలచే అందించారు. ఈ కార్యక్రమానికి ఉప్పులేటి నరేష్ అధ్యక్షత వహించగా ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గడప మానస, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, కోకన్వీన ర్ లు కొల్లూరి రవికుమార్, ఆసంపల్లి శ్రీనివాస్, దర్శనాల నవీన్, బండ శాంకరి, ఉప్పులేటి గోపిక, చిలుక శేఖర్, అంతర్పుల మధులు పాల్గొన్నారు.