calender_icon.png 11 March, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఉద్యమంలో మహిళలు భాగస్వాములు కావాలి

11-03-2025 12:48:12 AM

బీసీ సమాజ్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మాదేవి

మంచిర్యాల, మార్చి 10 (విజయక్రాంతి) : బిసి ఉద్యమంలో మహిళలు భాగస్వాములు కావాలని బీసీ సమాజ్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట పద్మాదేవి కోరారు. సోమ వారం బిసి సమాజ్ మహిళ కమిటీ ఆధ్వర్యంలో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే మహిళ సాధికారత సాధిద్దామని అన్నారు.

సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయిని, రచయిత్రి, ఆమె నిన్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బిసి రాజ్యాధికార సాధన లో మహిళలు ముఖ్య భూమిక పోషించాలని బీసీ ఉద్యమంలో మహిళ మేధావులు పాల్గొని బీసీ రాజ్యాధికార సాధన లో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ మహిళా విభాగం సీనియర్ నాయకురాలు ఈనవంక నాగలక్ష్మి, బూర్ల జ్యోతి, పొడేటి సంగీత, శ్రీరామోజు సాంబలక్ష్మి, రాపాక సారిక, కుమ్మరి రజిని, బొంపల్లి సునీత, సముద్రాల కవిత, చొప్పరి కవిత, శ్రీదేవి, రోడ్డ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.