- ‘కొమ్మూరి’ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు
- తెరపైకి ఝాన్సీరెడ్డి, ఇందిర పేర్లు
- హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం!
జనగామ, ఆగస్టు 24(విజయక్రాంతి): జనగామలో డీసీసీ కుర్చీని దక్కించుకునేందుకు కొందరు మహిళా నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం జనగామ డీసీసీ అధ్యక్షుడిగా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తిలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి చేరారు. జనగామ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. జనగామలో డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డిదే హవా కొనసాగుతుండగా, బీఆర్‌ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్లో చేరిన కడియం జిల్లా రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కడియం కాంగ్రెస్‌లోకి రావడంతో స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన సింగపురం ఇందిర పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిం ది. ఆమెకు స్థానికంగా బలమైన కేడర్ ఉన్నా, ఎలాంటి పదవి దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు. మొదట కడియం కాంగ్రెస్‌లోకి రావడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ హైకమాండ్ బుజ్జగించి, పార్టీలో సముచితస్థా నం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె కడియం రాకను స్వాగతించి.. ఎంపీ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపు కోసం కృషి చేశారు.
మరోవైపు పాల కుర్తిలో ఎ మ్మెల్యే యశస్వినిరెడ్డిని ఆమె అత్త ఝాన్సీరెడ్డి దగ్గరుండి మరీ గెలిపించారు. ప్రస్తుతం ఝా న్సీరెడ్డి పాలకుర్తి నియోజకవర్గ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ తరఫున నిర్వహిం చే కార్యక్రమాల్లో కోడలు యశస్వినితో కలిసి పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఝాన్సీరెడ్డికి ప్రోటోకాల్ సమస్య ఎదురవుతోంది. డీసీసీ అధ్యక్ష పదవి ఉంటే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.
కార్యకర్తలతో మంతనాలు..
డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్న సింగపురం ఇందిర, ఝాన్సీరెడ్డి తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఝాన్సీరెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి తో పరిచయాలు ఉండడం తో, డీసీసీ కుర్చీ కోసం నేరుగా ఆ యనతోనే సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సింగపురం ఇందిర తనకు హైకమాండ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరు నేతలకు తమ నియోజకవర్గాల్లో కార్యకర్తల బలం ఉండగా.. మిగతా నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలకు దగ్గరై వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఝాన్సీరెడ్డి ఓ అడుగు ముందు ఉన్నారు.
ఆమె నిత్యం జనగామ నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య లీడర్లల తో మాట్లాడి, స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వారికి అండ గా ఉంటానని హామీ ఇస్తూ దగ్గరయ్యే ప్రయ త్నం చేస్తున్నారు. చాప కింద నీరులా ఝా న్సీరెడ్డి జనగామలో కొమ్మూరికి దీటుగా ఓ వర్గాన్నే తయారు చేసుకున్నట్లు సమాచారం. జనగామలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపో యింది. నిత్యం ఓ వర్గం కొమ్మూరి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన్ను తప్పించాలని చూస్తోంది.
ఈ పరిణామాల ను ఝాన్సీరెడ్డి, ఇందిర అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నట్లు కార్యకర్తలు గుస గుసలాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌కు త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తా రనే ప్రచారం నడుస్తోంది. తర్వాత డీసీసీ అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమ యంలో జనగామ డీసీసీ పీఠంపై ఇందిర, ఝాన్సీరెడ్డి పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి.