calender_icon.png 4 October, 2024 | 6:59 AM

లగ్జరీ స్పిరిట్స్‌పై మహిళలకు పెరుగుతున్న మక్కువ

09-09-2024 12:00:00 AM

డియాజియో చీఫ్ వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తమ వ్యాపారానికి భారత్ అతిపెద్ద వృద్ధి అవకాశాన్ని అందిస్తున్నదని గ్లోబల్ ఆల్‌హాల్ కంపెనీ డియా జియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేబ్రా క్రూ చెప్పారు. భారత్‌లో మహిళలు ప్రత్యేకించి యువ త స్పిరిట్స్ వినియోగం తీరును మార్చేస్తున్నారని, ప్రీమియం స్పిరిట్స్ విభాగంలో వృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. లగ్జరీ స్పిరిట్స్ విభాగంలో తమ భారత్ మార్కెట్ వ్యాపారం అగ్రస్థానంలోనూ, విలువలో ద్వితీయస్థానంలోనూ ఉన్నదని క్రూ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా మేము భారీ అవకాశాల్ని పొందుతున్నాం.

కానీ భారత్‌లో లభిస్తున్న వృద్ధి మరే దేశంతోనూ సరితూగదు. మా పలు బ్రాండ్లు మహిళలకు నచ్చుతున్నాయి. ప్రత్యేకించి యువతరంలో మార్పును చూస్తున్నాం. ఇది (ఆల్క్‌హాల్ తీసుకోవడం) నిషేధితమైనదిగా పరిగణించడం లేదు’ అని డియోజియో చీఫ్ తెలిపారు. డియోజియో ఇండియా సబ్సిడరీ యునైటెడ్ స్పిరిట్స్‌గా దేశీయ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టెడ్ కంపెనీ.బ్లాక్ లేబుల్, గొడవాన్, ఎపిటోమ్ రిజర్వ్, సింగల్టన్, సిగ్నేచర్, బ్లాక్‌డాగ్ బ్లాక్ రిజర్వ్, సిరోక్, బ్లాక్ అండ్ వైట్ తదితర ప్రీమియం బ్రాండ్లు డియాజియో స్టేపుల్‌లో ఉన్నాయి.