calender_icon.png 15 January, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ మ్యాట్రిమోనీ ఉచ్చులో మహిళలు!

10-09-2024 02:30:00 AM

టెక్నాలజీ మనిషి జీవితంలో భాగమైంది. ఎంతోమంది మహిళలు టెక్నాలజీని వాడుతూ రోజువారి పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే టెక్నాలజీ వాడకం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతేస్థాయిలో నష్టాలున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. జులియో, యూగవ్ అనే సంస్థలు నిర్వహించిన సర్వేలో దారుణమైన విషయాలు వెలుగుచూశాయి. ఎక్కువ శాతం మహిళలు డేటింగ్ యాప్, మ్యాట్రిమోనీ యాప్స్ వాడుతున్నారని, అయితే  78 శాతం మంది మహిళలు ఫేక్ ప్రొఫైల్స్ బారిన పడ్డారని గుర్తించాయి. ఈ సర్వే మహిళల భద్రత, గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రెగ్యులర్‌గా ఇలాంటి యాప్స్ మహిళల్లో మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నట్టు కూడా గుర్తించారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ ఐడి వెరిఫికేషన్ కచ్చితంగా అవసరమని సర్వేలు సూచించాయి. ఇదే విషయమై ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ కామ్నా చిబ్బర్ మాట్లాడుతూ.. “ఆధునిక కాలంలో మహిళలకు మంచి సంబంధాలు సవాలుగా మారుతున్నాయి. మంచి భాగస్వామిని ఎంచుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. పెళ్లి చేసుకునేక్రమంలో ఫేక్ ప్రొఫైల్స్ మహిళలకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.  శారీరక, భావోద్వేగ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు బలమైన చట్టాలు చాలా అవసరం” అని చెప్పిందామె.