calender_icon.png 30 September, 2024 | 7:53 AM

మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం

30-09-2024 01:45:52 AM

  1. మెరుగైన సమాజానికి అదే సంకేతం
  2. పింక్ పవర్ రన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  3. పెద్దసంఖ్యలో హాజరైన ఔత్సాహికులు
  4. మారథాన్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : మహిళల ఆరోగ్యమే కుటుంబ, సమాజ శ్రేయస్సుకు పునాది అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎంఈఐఎల్, సుధారెడ్డి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో బ్రెస్ట్(రొమ్ము) క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు గాను ఆదివారం గచ్చిబౌలీలో ‘పింక్ పవర్ రన్’ను నిర్వహించారు.

  3,  5, 10 కిలో మీటర్ల కేటగిరీలో నిర్వహించిన మారథాన్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ మారథాన్‌కు భారీ స్థాయిలో ఔత్సాహికులు హాజరయ్యారు. గచ్చిబౌలిలో ప్రారంభమైన మారథాన్లు ఐఎస్‌బీ, విప్రో జంక్షన్ల మీదుగా తిరిగి స్టేడి యంకు చేరుకున్నాయి.

తెలంగాణ శాప్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, ఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధారెడ్డి, ఉషాలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఉషా లక్ష్మి, ప్రభుత్వ అధికారి క్రిస్టీనా తదితరులు పాల్గొన్నారు.