calender_icon.png 9 January, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

09-01-2025 01:13:02 AM

  • స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి 

త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎస్.హె.జీల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై సమీక్ష

గద్వాల, జనవరి 08 ( విజయక్రాంతి ) : మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలతో ముందుకె ళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్వయం సహాయక సంఘా ల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పి వేయి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య పరస్పర  ఒప్పందం ఖరారయ్యిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ లోకేష్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్ తదితరులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధ వారం ఆయా జిల్లాల కలెక్టర్లతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియపై ప్రగతిని సమీ క్షించారు.

ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఈ దిశగా మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఆర్ధిక చేయూతను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుంటూ సమర్ధవంత మైన వ్యాపార లావాదేవీలతో ఆర్ధిక పరిపుష్టి సాధించేలా అధికారులు తోడ్పాటును అం దించాలని సూచించారు. 

మహిళా సంఘా లు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం వారికి అందుబాటులో ఉన్న స్థలాన్ని, ప్రభు త్వ భూములను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పా టు కోసం బ్యాంకుల ద్వారా మహిళా సం ఘాలకు ఆర్థిక సహాయం ఇప్పించేలా చొరవ చూపాలన్నారు.  మహిళా సంఘాల భూ ముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్ కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వర లోనే వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆసక్తి, అర త కలిగిన మహిళా సంఘాలను గుర్తించి, భూసేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సా యం అందించే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సోలార్ ప్లాంట్ల ద్వారా ఒక మెగావాటు వి ద్యుత్ ఉత్పత్తికి నాలుగు ఎకరాల స్థలం అవ సరం అవుతుందని, ఈ లెక్కన ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ర్ట వ్యాప్తంగా సుమారు నాలుగు వేల ఎకరాలు సేకరిం చాల్సి ఉంటుందని అన్నారు.

లాగే, ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం అవుతుందని, ఈ మేరకు మినీ ఇండస్ట్రి యల్ ఏరియాల ఏర్పాటు కోసం స్థల సేకర ణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్, అదనపు కలెక్టర్ నర్సింగ రావు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. తిరుపతిరావు, అడిషనల్ పిడి నరసింహులు పాల్గొన్నారు.