calender_icon.png 16 April, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

16-04-2025 02:03:30 AM

  1. అంబేద్కర్, రాజీవ్‌గాంధీ వల్లే మహిళలకు విశిష్ట అధికారాలు
  2. గ్రీన్‌పవర్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం
  3. స్త్రీ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. దేశంలోని మహిళలకు విశిష్ట అధికారాలు, హక్కు లు, రాజకీయాల్లో వాటాకు డా.బీఆర్ అంబేద్కర్, మాజీప్రధాని రాజీవ్‌గాంధీ పునాదులు వేశారని తెలిపారు. మంగళవారం తాజ్ దక్కన్‌లో జరిగిన స్త్రీ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు..

దేశంలో బాల్యవివాహాల నిర్మూలన, వరకట్నం నిషేధం, మహిళలకు ఓటు హక్కు, విడాకులు, ఆస్తిలో మహిళలకు వాటా వంటి చట్టాలు అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ద్వారానే ఆచరణలోకి వచ్చాయని వివరించారు. స్థానిక సంస్థల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను రాజీ వ్ గాంధీ తీసుకొచ్చారని తెలిపారు.

ఐదేళ్లలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడంలో భాగంగా మొదటి సం వత్సరం లక్ష్యానికి మించి రూ.21వేలకోట్ల వడ్డీలేని రుణాలను ఎస్‌హెచ్‌జీ మహిళలకు అందజేశామని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో ప్రతి యేటా రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలను అందజేస్తామన్నారు. 

సోలార్ ఉత్పత్తిరంగంలోకి మహిళలు

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతన గ్రీన్‌పవర్ పాలసీలో మహిళలకు భాగస్వామ్యం కల్పించి, సోలార్ ఉత్పత్తి రంగంలోకి వారిని తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం స్పష్టంచేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే పెద్దఎత్తున వారితో సోలార్ ఉత్పత్తి చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.

బ్యాంకు లింకేజీ ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పా టు చేయించి, ఖాళీ స్థలాలు ప్రభుత్వమే లీజుకు ఇచ్చి, మహిళ సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చు కున్నామని వివరించారు. స్త్రీ సమ్మి ట్ వంటి కార్యక్రమాలు ప్రజలను సన్మార్గంలో నడపడానికి, ప్రభుత్వాలు సరైన చట్టాలు తీసుకురావడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.