calender_icon.png 22 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతకు పెద్దపీట

24-07-2024 01:30:52 AM

వారి పేరు మీద కొనుగోలు చేసే ఆస్తులకు తక్కువ స్టాంప్ డ్యూటీలు

మరిన్ని వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్

స్కిల్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు

మహిళల మీద వరాల జల్లు కురిపించిన నిర్మలమ్మ  

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర ప్రభుత్వం మంగళవా రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల పేరు మీద కొనుగోలు చేసే ఆస్తులకు తక్కువ పన్ను విధించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటిం చారు. మహిళలను పట్టణ అభివృద్ధి ప్రణాళికల్లో ముఖ్యుల ను చేసేందుకే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు ప్రకటించా రు. పన్ను ప్రయో జనాలను పొందేందుకు ఆధార్ నెంబ ర్ స్థానంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని సమర్పించాలనే ప్రతిపాద నను కూడా వెనక్కు తీసుకోవాలని ప్రతిపాదిం చారు. ప్రస్తుతం ఉన్న స్టాంప్ డ్యూటీలను పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కానీ మహిళల పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులకు తక్కువ స్టాంప్ డ్యూటీ వేసేలా చూస్తామని చెప్పారు. పట్టణ అభివృద్ధి ప్రణాళికల్లో ఇది గేమ్ చేంజర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్

ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంపొందించేందుకు, ఉత్పాదకతలో వారి భాగస్వామ్యం పెంచేందుకు మరిన్ని వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలోని నిరుపేద, మహిళలు, యువత, రైతులకు మరింత ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఆమె మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నారు. మహిళల వర్క్ ఫోర్స్‌ను పెంచేందుకు మరిన్ని వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ నెలకొల్పనున్నట్లు ఆమె తెలిపారు.

అంతే కాకుండా మహిళల స్కిల్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మార్కెట్లలో మరింత భాగస్వామ్యం కల్పించనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 3 లక్షల కోట్లతో మహిళలు, బాలికల కోసం పథకాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎలా తపన పడుతుందో ఈ విధానాల ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు.