calender_icon.png 25 October, 2024 | 8:02 AM

మైక్రోసాఫ్ట్‌ను అధికంగా వీడుతున్న మహిళా ఉద్యోగులు

25-10-2024 12:00:00 AM

శాన్‌ఫ్రాన్సిస్కో: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో వైవిధ్యాన్ని కాపాడేందుకు అవస్థలు పడుతోంది. ఆ సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయే వారిలో కొన్నివర్గాల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించింది. ము ఖ్యంగా మహిళలు, నల్లజాతీయులు, లాటినిక్‌సలు కంపెనీని వీడటం ఎక్కువైంది. కంపెనీకి చెందిన డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ రిపోర్టు బుధవారం విడుదలైంది. దీనిలో ఈ విషయాలు బయటపడ్డాయి.

వీటిల్లో స్వ చ్ఛంద రాజీనామాలు, కంపెనీ నుంచి తొలగింపులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాజీనామాల్లో 32.7శాతం మహిళలే ఉన్నట్లు తేలింది. గతేడాది 31%తో పోలిస్తే ఇది స్వల్పంగా పెరిగింది. నల్లజాతీయుల రాజీనామాలు 8.7శాతంనుంచి 10శాతానికి, లాటినిక్స్ 8శాతం నుంచి 9.8శాతానికి పెరిగినట్లు తేలింది.

ప్రత్యర్థి సంస్థలు తమ ఉద్యోగులను లాక్కోవడం, ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారంలోకి మారడం వంటి కారణాలుగా భావిస్తోంది. ప్రాతినిధ్యం లేని వివిధ వర్గాల ప్రజలను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ కొనసాగిస్తుందని సంస్థ డైవర్సిటీ అధికారి లిండ్సే రే మైక్‌ఇంటైర్ వెల్లడించారు. అలా నియమించుకొన్నవారిని మెంటార్లను ఏర్పాటుచేసి కెరీర్ ఆప్షన్లు ఇస్తామని తెలిపారు.

అప్పుడే వారు నమ్మకముంచి మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతార న్నారు. ఇప్పటికే క్లౌడ్ రంగంలో సం స్థ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తరిస్తోంది. దీంతో వివిధ వర్గాల ప్రజలను నియమించుకొనే అవకాశం లభిస్తోందని లిండ్సే పేర్కొన్నారు. ఉద్యోగుల్లో వైవిధ్యం సంస్థ చేపట్టే కృత్రిమ మేధ ప్రాజెక్టులకు చాలా ముఖ్యం. వీటిని జాతి, లింగ వివక్ష లేకుండా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.