calender_icon.png 19 January, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళవి.. నీకన్నీ తెలుసా?

25-07-2024 01:32:31 AM

మహిళా ఎమ్మెల్యేపై గరం అయిన సీఎం నితీష్

అసెంబ్లీలోనే సహనం కోల్పోయిన జేడీయూ బాస్

నివ్వెరపోయిన సభ్యులు

పట్నా, జూలై 24: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం అసెంబ్లీలో ఆర్జే డీ మహిళా ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల గురించి ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే రేఖా పాశ్వాన్ అడగడంతో సహనం కోల్పో యి ఆమె మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నువ్వో మహిళవి.. నీకు ఏమీ తెలియదు.. కూర్చోని విను” అని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి. రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టేసింది. నితీష్ ఒక మహిళా ప్రతినిధిని పట్టుకుని అలా అనడంపై ఆర్జేడీ లీడర్, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ మండిపడ్డారు.