13-04-2025 11:06:31 PM
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని ఉజ్లంపాడ్ తండాకు చెందిన జాదవ్ మహదేవికి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా చాప్టా శివారులో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఈఎంటీ సంగ్ శెట్టి తెలిపారు. నారాయణ్ ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ చేయగా తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.