మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. సీఎంఆర్ కళాశాల(CMR College)లోని బాత్ రూంలో సెల్ ఫోన్లతో వీడియోలు రికార్డు చేస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు. అయితే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్(Telangana State Women's Commission) స్పందించి వీడియోల చిత్రికరణ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. వెంటనే ఈ కేసుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి(Cyderabad CP Avinash Mohanty)కి ఆదేశాలు జారీ చేసింది.
బాత్ రూంలో సెల్ ఫోన్లతో వీడియోలు రికార్డు చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. దీంతో కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థినులకు మద్దతుగా ఇవ్వడంతో గతరాత్రి 2 వరకు ఆందోళన కొనసాగించారు. సమాచారం అందుకున్న సీఐ సీఎంఆర్ కళాశాల వద్ద వెళ్లి విద్యార్థి సంఘాలతో మాట్లాడి ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో సీఎంఆర్ కళాశాలలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.